లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులు, దాతలు ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
గడిచిన రెండు సంవత్సరాలుగా గ్రేటర్ లాస్ ఏంజిల్స్ లోని తెలుగు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మీ అందరికీ, 2020-2021 లాటా కార్యవర్గం మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తరపున కృతజ్ఞత తెలుపుతున్నాము.
అత్యంత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో 2020 సంక్రాంతి సంబరాలు తో మొదలైన మా పదవీ కాలం, రెండు నెలల్లోనే కరోనా వల్ల గణనీయమైన మార్పులు చెయ్యవలసి వచ్చింది. సాహసోపేతమైన ఎంతో మంది స్వచ్ఛంద సేవకులు ముందుకు రావటంతో Covid Response Committee ని మొదలు పెట్టి, స్థానికం గాను, భారత దేశం లోనూ మాస్కులూ మరియు PPE లను పంచడం, ఇక్కడి డాక్టర్స్ తో భారత దేశంలో ఉన్న కోవిడ్ పేషెంట్స్ తో hotline ద్వారా సేవలని అందించటం, హైదరాబాద్, చిత్తూర్, కాకినాడ లో కోవిడ్ భారిన పడిన వాళ్లకు సహాయం చెయ్యటం, frontline వర్కర్స్ కి మనోధైర్యం కోసం కార్ ర్యాలీ నిర్వహించటం, వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని అందించటం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాము.
మన అలవాట్లలో వస్తున్న మార్పులు, వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలని గుర్తించి, ఒక ఆరోగ్య సెమినార్ తో చాలించకుండా, ప్లాంట్ బేస్డ్ ఇనిషియేటివ్, Miles ఛాలెంజ్, అధిక బరువు తగ్గించటం వంటి అనేక జనాదరణ పొందిన కార్యక్రమాలు నిర్వవించాము.
కోవిడ్ లాక్ డౌన్ వల్ల మానసిక వత్తిడికి గురికాకూడదని, ఇర్వైన్ లో సమ్మర్ Picnic, మహిళల దినోత్సవం, Father's Day సెలబ్రేషన్, సాహిత్యం పోటీలు, ఆర్ట్ కాంపిటీషన్, చెస్, వాలీబాల్ టోర్నమెంట్స్, ముగ్గులు పోటీలు, వంటల పోటీలు వంటి ఎన్నో ఉల్లాసవంతమైన కార్యక్రమాలని నిర్వహించాము. వీటితో పాటు POPM training, ఎస్టేట్ ప్లానింగ్, ఇమ్మిగ్రేషన్ మరియు టాక్స్ సెమినార్లు వంటి కార్యక్రమాలు నిర్వవించాము.
కోవిడ్ వల్ల బయటకి రావటానికి కూడా భయపడిన పరిస్థితుల్లో ఇన్ని కార్యక్రమాలని చేసే అవకాశం వచ్చింది అంటే, అందుకు సహాయ పడిన ప్రతీ ఒక్క కార్యకర్తకీ, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. లాటా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, ప్రేక్షకులకు, లాటాకి వెన్నుదన్ను గా నిలిచిన సభ్యులకు, దాతలకు, sponsors కు, మద్దతు దారులకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాము. లాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ తో పని చెయ్యటం వినయంతో కూడిన గర్వంగా భావిస్తున్నాము.
లాటా కొత్త కార్య వర్గం మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అత్యుత్తమమైన కార్యకర్తలతో కూడుకుంది. వారికి మా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మా సంపూర్ణ మద్దతు తెలుపు తున్నాము. మీరందరు మాకు ఎలా అయితే మద్దతు ఇచ్చారో, అంతకన్నా ఎక్కువగా, వారికి సహాయ పడాలని, తొందరలో వస్తున్న సంక్రాంతితో మొదలుకొని, అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చెయ్యాలని పార్థిస్తున్నాము.
--- లాటా కార్య వర్గం మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ (2020-2021)